TOLL GATES: ఇకపై రయ్ రయ్.. టోల్‌గేట్లకు గుడ్ బై.. ఎందుకంటే?

రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అది కాస్తా అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా రానున్న ఓ టెక్నాలజీ(Technology) ఇకపై మన ట్రావెలింగ్ టైమ్‌ను తగ్గించనుంది. ఇంతకీ అదేంటంటే.. టోల్ గేట్ల(Toll Gates) వద్ద కొత్త మార్పులకు కేంద్ర సర్కార్(Cental Govt) శ్రీకారం చుడుతోంది ఫాస్టాగ్(Fastag) విధానాన్ని తొలగించి ఇకపై జీపీఎస్ టోల్ (Global Navigation Satellite System) వసూలు విధానాన్ని అమలు చేయబోతోంది. దీనికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా మే ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

Image

టోల్ గేట్ల వద్ద విప్లవాత్మక మార్పులు

జాతీయ రహదారులపై వాహనాలు వేగంగా వెళ్లేందుకు NDA సర్కార్ ఫాస్టాగ్‌ని తీసుకొచ్చింది. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా అయ్యేది. వెళ్లాల్సిన సమయానికి కాస్త అటు ఇటు చేరుకునేవారు. తాజాగా టోల్ గేట్ల వద్ద విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలని ఆలోచన చేస్తోంది. ఇకపై GPS ఆధారంగా TOLL వసూలు విధానాన్ని తీసుకురానుంది. ఇది వచ్చాకా జాతీయ హైవేలపై టోల్ ప్లాజాలను తొలగిస్తారు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీ(Toll Charge) వసూలు కానున్నాయి.

Image

ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీ

ఈ లెక్కన టోల్ గేట్ల వద్ద వాహనం ఆపాల్సిన అవసరం లేదన్నమాట. తొలుత వాణిజ్య వాహనాలపై అమలు చేయనుంది. ఆ తర్వాత మిగతా వాహనాలకు విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. వాహనదారులు ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీలను లెక్కిస్తారు. వాటి ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. చెల్లించేందుకు డిజిటల్ వాలెట్ లేకుంటే లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు వాహనాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *