ManaEnadu:ప్రముఖ నటుడు సిద్ధార్థ్, నటి అదితీ రావు హైదరీ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఒక్కటైంది. తెలంగాణలోని వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్యూట్ కపుల్, పవర్ కపుల్, బ్యూటీఫుల్ కపుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతున్నారు.
![]()
గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వనపర్తి ఆలయంలోనే ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుంది. అప్పుడే వీరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్వరలోనే వివాహ డేట్ చెబుతామని తెలిపింది. ఇప్పుడు సడెన్‌గా ఈ జంట అతికొద్ది మంది అతిథుల సమక్షంలో దైవసాక్షిగా ఒక్కటైంది. అదితీరావు హైదరీ వనపర్తి సంస్థానానికి యువరాణి అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంతో ఆమెకు చాలా అనుబంధం ఉంది. అందుకే తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతంలో తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది ఈ కొత్త జంట.
![]()
ఈ ఫొటోలను షేర్ చేసిన అదితి.. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’’ అని క్యాప్షన్ జత చేసింది. ఇక సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది కొంతకాలానికి అది స్నేహంగా మారిందని, తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది.
![]()
“హైదరాబాద్‌లో తన నానమ్మ ప్రారంభించిన స్కూల్ అంటే తనకెంతో ప్రత్యేకమని.. ఆ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఆ స్కూల్‌కు తనను తీసుకెళ్లమని అడిగాడు. ఈ ఏడాది మార్చిలో మేమిద్దం ఆ స్కూల్‌కు వెళ్లాం. అప్పుడు సడెన్‌గా సిద్ధు.. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు’’ అని అదితి తమ ప్రేమ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.
View this post on Instagram






