చై-సామ్ విడాకులపై కొండా సురేఖ కామెంట్స్.. ఏకకంఠంతో ఖండిస్తున్న టాలీవుడ్

Mana Enadu :  రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) టాలీవుడ్ నటుడు నాగచైతన్య, సమంత (Samantha) విడాకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపిన ఈ వ్యాఖ్యలపై ఇటు రాజకీయ నేతలు.. అటు టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలను నాగార్జు, సమంత, ప్రకాశ్ రాజ్ ఖండించిన విషయం తెలిసిందే. 

దురదృష్టవశాత్తూ అవి నా కంట పడ్డాయి

తాజాగా ఈ ఘటనపై అక్కినేని అమల, గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) స్పందించారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు సమంత పేరుతో వీడియోలు పెట్టడం దారుణం అని అన్నారు. దురదృష్టవ శాత్తూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు, మీడియాకు చెందిన వ్యక్తులు పెట్టిన దారుణ వీడియోలు, పోస్టులు చూశానని తెలిపారు. తమ మైలేజీ పెంచుకోవడంతో పాటు డబ్బు, క్లిక్స్‌, వ్యూస్‌ కోసం కొన్ని తెలుగు యూట్యూబ్‌ ఛానళ్లు సమంత పేరును ప్రముఖంగా ప్రస్తావించాయని అన్నారు.

వీళ్ల కర్మకాలి పోవాలి

చివరికి అర్థమైంది ఏంటంటే, నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి వీళ్లందరికీ ఆమె పేరు కావాలని.. మరో మార్గం లేదని చిన్మయి వ్యాఖ్యానించారు. “ఒక్క విషయమైతే కచ్చితంగా చెప్పగలను. కలలో కూడా ఆమె స్థాయిని ఎవరూ అందుకోలేరు. వీళ్ల కర్మకాలిపోవాలని కోరుకోవడానికి నవరాత్రికి మించిన మంచి సమయం మరొకటి లేదు’’ అని ఎక్స్‌ వేదికగా చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడతారు

 ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ (phone tapping case) వివాదంపై సమంత కచ్చితంగా స్పందించాలి.’’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై చిన్మయి స్పందిస్తూ ‘‘ఆమె ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు వాళ్ల నోటికొచ్చింది మాట్లాడుతారు. చేయాల్సింది చేస్తారు. వాళ్లు  ఎవరూ జవాబుదారీగా ఉండరు’’ అని సమాధానం ఇచ్చారు.

రాహుల్ జీ మీ వాళ్లను కాస్త అదుపులో పెట్టుకోండి

మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల (Akkineni Amala) కూడా స్పందించారు. ‘‘ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి’’ అని పోస్ట్‌ చేశారు.

ఇలాంటి వాళ్లతో కొన్నిసార్లు తప్పదమ్మా

ఇక అమల పోస్ట్‌పై హీరో అఖిల్‌ (Akkineni Akhil) స్పందిస్తూ.. ‘‘అమ్మ నీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నా. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. ఇలాంటి అర్థంలేని విషయాన్ని మీరు పరిష్కరించాల్సి వచ్చినందుకు క్షమించండి. కానీ కొన్నిస్లారు ఇలాంటి వ్యక్తులతో కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. వేరే మార్గం ఉండదు’’ అని పోస్టు పెట్టారు. ఇక నాగార్జున కూడా స్పందిస్తూ,. సినీ ప్రముఖ జీవితాలను రాజకీయ విమర్శల కోసం వాడుకోవద్దని హితవు పలికారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు

Samantha Reacted to Minister Konda Surekha Comments

ఇక దీనిపై సమంత (Samantha) స్పందిస్తూ ఇన్ స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సామ్‌ తన సోషల్​ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *