Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా అందించింది. టాలీవుడ్ హారర్ చిత్రా(Tollywood Horror Movies)ల్లో ఈ మూవీ కల్ట్ ఫాలోయింగ్ దక్కించుకుంది. డైరెక్టర్ సాయి కిరణ్(Director Sai Kiran) తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఈ మూవీలో సంగీత(Sangeetha), తిరువీర్(Thiruveer) తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు మరో OTTలో సందడి చేస్తోంది.

Masooda Movie Review: This one's for the horror fanatics

గ్లోబల్‌ ఆడియన్స్‌ను రీచ్ అయ్యేందుకే

తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఇప్పుడు మరింత రీచ్ వస్తుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయితే, ఈ చిత్రం గ్లోబల్‌గా ఆడియెన్స్‌(Global Audiance)ను రీచ్ అవుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీని రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేయగా, ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందించారు.

Masooda Total Collections: మసూద సంచలనం.. బిజినెస్‌కు 4 రెట్లు వసూళ్లు..  అన్ని కోట్ల లాభాలతో రికార్డు | Masooda Movie Closing Box Office Collections  - Telugu Filmibeat

కథేంటంటే..

నీలం (Sangeetha) భర్తకు దూరంగా తన కుమార్తె నాజియాతో (Kavya Kalyanram) కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటుంది. 17 ఏళ్ల నాజియా దెయ్యం పట్టినట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపి (Thiruveer) సాయం కోరుతుంది. నాజియాను ధైర్యం లేని గోపి ఎలా కాపాడాడు.. అసలు ఆమెకు ఏమైంది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మరోసారి ‘మసూద’ థ్రిల్లర్‌ని ఎంజాయ్ చేసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *