Gaami | సూపర్ స్ట్రాంగ్ గా “గామి”..

Mana Enadu: యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గామి” కోసం అందరికీ తెలిసిందే. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో ఊహించని రేంజ్ విజువల్స్ ప్రామిస్ చేయడంతో ఆడియెన్స్ లో కూడా ఆసక్తి రేగింది. దీనితో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక లేటెస్ట్ గానే ఈ చిత్రం 3 లక్షల డాలర్స్ మార్క్ ని కూడా క్రాస్ చేసి ఆదరగొట్టింది.

ఇక దీనితో పాటుగా ఈ సినిమాకి అక్కడ మరింత డిమాండ్ నెలకొనడంతో మరిన్ని షోలు స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారట. దీనితో గామి యూఎస్ నార్త్ అమెరికా ఆడియెన్స్ కి మరింత అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా నిర్మాణం వహించారు. అలాగే యూవీ సెల్యులాయిడ్ వారి సమర్పణలో చిత్రం రిలీజ్ కి వచ్చింది.

 

Share post:

లేటెస్ట్