టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni), రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరి వివాహం ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు తెలిసింది. ఈ జంట పెళ్లి చేసుకున్నారని తెలిసి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
మహానటితో ఫేమ్
టాలీవుడ్ సింగర్ అనురాగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. మహానటి (Mahanati) టైటిల్ సాంగ్, శ్యామ్ సింగరాయ్ లో ప్రణవాలయ, కేరాఫ్ కంచెరపాలం మూవీలో ఆశాపాశం వంటి పాటలతో ప్రేక్షకులకు అనురాగ్ మరింత దగ్గరయ్యాడు. ఇక ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచిన అనురాగ్ కు.. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ప్రస్తుతం ఇతను టాప్ సింగర్ గా కొనసాగుతున్నాడు.
ప్లే బ్యాక్ సింగర్ రమ్య బెహరా
మరోవైపు రమ్య బెహరా (Ramya Behra) కూడా ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది. సూపర్ సింగర్ 4లో పాల్గొన్న ఈమెను ఆస్కార్ విన్నర్ కీరవాణీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఒక లైలా కోసం, టెంపర్, లౌక్యం, ప్రేమకథా చిత్రం, చిన్నదాన నీకోసం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar), దిక్కులు చూడకు రామయ్య, రంగ్ దే, రెడ్, శతమానం భవతి వంటి సినిమాల్లో రమ్య పాటలు పాడి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
కొత్త జంటకు శుభాకాంక్షలు
ఇప్పుడు ఈ ఇద్దరు ప్లే బ్యాక్ సింగ్స్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నూతన జంటకు టాలీవుడ్ ప్రముఖులు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ నెట్టింట శుభాకాంక్షలు (Anurag Ramya Marriage) చెబుతున్నారు. మరోవైపు సడెన్ గా తమ పెళ్లి ఫొటోలతో సర్ ప్రైజ్ చేశారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. క్యూట్ కపుల్ అంటూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Happy married life both of you ❤️❤️#Anuragkulkarni #ramyabehara
Both are top singers from Tollywood 🎉🙌🎉🎉🥳 pic.twitter.com/z2F5wHnJda— SATYA-RCF🚁 (@Satya_Rcf) November 15, 2024






