Ganesh Immersion: ఉత్సాహంగా గణేశ్ నిమజ్జనం.. నిర్ణీత సమయంలోనే పూర్తిచేస్తామన్న సీపీ

ManaEnadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో గణేశుడి నిమజ్జన(Ganesh idol immersion) క్రతువు వేడుకగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహానగరంలోని హుస్సేన్ సాగర్(Hussain Sagar), ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. మరోవైపు నిమజ్జన ప్రక్రియ కూడా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్( Hyderabad CP C V Anand) మాట్లాడారు. రేపు ఉదయం వరకు నిమజ్జం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూశామన్నారు.

 పెండింగ్‌లో మరో 20 వేల విగ్రహాల నిమజ్జనం

ఇదిలా ఉండగా భాగ్యనగరంలో ట్రాఫిక్‌(Traffic)కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని CP వెల్లడించారు. నిమజ్జనంలో పోలీసుల నిరంతరం సేవల దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వారికి రోటేషన్ మెథడ్‌(Rotation Method)లో డ్యూటీలు వేసినట్లు వివరించారు. ఒక్కో షిఫ్ట్‌లో 25వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నట్టు సీపీ వివరించారు. తాము లక్ష విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని భావించామని, ఇందులో ఇంకా 20 వేల విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉందని చెప్పారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్‌(Tank Bund)పై నిమజ్జనాన్ని చూడాలనుకునే భక్తులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌(Public transport)లో రావాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని సీవీ ఆనంద్ వివరించారు.

 జై గణేశా నినాదంతో మోతెక్కిన ట్యాంక్‌బండ్‌

కాగా మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Maha Ganapati) నిమజ్జన ప్రక్రియ పూర్తైంది. భక్తుల కోలాహలం మధ్య NTR మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర.. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *