పప్పు, ఉప్పు, కాయగూరలు.. తెలంగాణలోనే ధరలు అత్యధికం

ManaEnadu:దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణాల్లో గత 12 ఏళ్లలో ఎలాంటి మార్పు లేదు. దానికి కారణం రోజువారీ ఆకలి తీర్చే నిత్యావసర సరకుల ధరలు (essentials rates) పెరగడం. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే తెలంగాణ (Telangana)లో నిత్యావసర ధరలు అత్యధికంగా ఉన్నాయి. జాతీయ సగటు ధరలు దాదాపు వంద శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 200 శాతం పెరిగాయి. ఈ మేరకు కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

జాతీయ నమూనా సర్వే సంస్థ ‘వినియోగదారుల ధరల సూచిక’ (Consumer Price Index – CPI), ‘వినియోగదారుల ఆహార ధరల సూచిక’ (Consumer Food Price Index – CFPI) 2024 ఆగస్టు నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ సంస్థకు చెందిన సిబ్బంది క్షేత్రస్థాయిలో దేశవ్యాప్తంగా 1,114 పట్టణ మార్కెట్లు, మరో 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో ఈ నివేదిక రూపొందించింది. కీలకమైన నిత్యావసర సరకుల ధరల్లో పెరుగుదల తీరును సరకులవారీగా, రాష్ట్రాలవారీగా కేంద్రం నివేదికలో వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం..

2024 ఆగస్టులో దేశంలో చేపలు (Fishes), మాంసం, సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గాయి. ఆహార ధరల సూచిక జాతీయ సగటు ఏడాది వ్యవధిలో 192.5 నుంచి 203.4కు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. కూరగాయల ధరల (Vegetables Price) సూచిక జాతీయ సగటు అత్యధికంగా 260.6కి చేరినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 10.71 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఇక పప్పులు, వాటి ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 13.60 శాతం పెరిగింది.

తెలంగాణలోనే అత్యధికం

వినియోగదారుల ధరల సూచిక(CPI) 2012-24 మధ్యకాలంలో జాతీయ సగటు 100 నుంచి 193 పాయింట్లకు పెరగగా.. త్రిపుర 215, మణిపుర్‌ 213.4, తెలంగాణ 201.6 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో నిలిచినట్లు ఈ నివేదిక తెలిపింది. మణిపుర్, త్రిపుర (Tripura)లు దేశ ఈశాన్య ప్రాంతంలో మారుమూలన ఉన్నందువల్ల రవాణా ఛార్జీలు అధికమై నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కానీ, సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ 201.6 సీపీఐతో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక గతేడాది ఆగస్టులో నమోదైన సీపీఐతో పోలిస్తే 2024 ఆగస్టుల 201.6 సీపీఐతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

Related Posts

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

ముక్కలేనిదే ముద్ద దిగదక్కడ.. దేశంలో అతిగా మాంసం తినే 10 రాష్ట్రాలివే

పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. పార్టీ చేసుకోవండ ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇక ఆ పార్టీలో నాన్ వెజ్ (Non Veg) మాత్రం పక్కాగా ఉండాల్సిందే. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతలా మన జీవితంలో మాంసాహారం భాగమైపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *