US Elections: ట్రంప్ గెలిస్తే.. భారత్‌కు కష్టమే: తాజా నివేదిక

Mana Enadu: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్(US presidential election campaign) హోరాహోరీగా సాగుతోంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్(Kamala Harris) నువ్వానేనా అన్నట్లు ప్రచారం, డిబేట్లు(Campaign, Debates) నిర్వహిస్తున్నారు. అధికారమే లక్షమే ఈ ఇద్దరూ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ(Republican Party) నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) తరఫున కమలా హారిస్ బరిలో ఉన్నారు. అయితే కమలా హారిస్ వచ్చాక పరిస్థితి కాస్త టఫ్ అయినా కూడా ప్రస్తుతం ట్రంప్‌కే విన్నింగ్ ఛాన్సెన్ ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ ట్రంప్ గెలిస్తే భారత్‌(India)కు షాక్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

వీసా కష్టాలు తప్పవు

తాజాగా ట్రంప విన్ అయితే ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ఫిలిప్‌ క్యాపిటల్‌( PhillipCapital) సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్‌ పార్టీ కనుక విజయం సాధిస్తే…ఇంతకు ముందులానే వీసా(Visa)ల ప్రాబ్లెమ్ మళ్లీ షురూ అవుతుందంది. వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని.. ఇవి ITకంపెనీలకు సవాళ్లను విసురుతాయని అంటున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు…ఇండియా నుంచి ఉద్యోగులను తెప్పించుకోవడం మానేస్తాయని.. స్థానికులనే నియమించుకుంటాయని చెబుతున్నారు.

 వారికి డిమాండ్ తగ్గిపోయింది

ఇప్పటికే అమెరికన్ మార్కెట్‌(American markets)లో భారత ఉద్యోగుల(Indian employees)కు డిమాండ్ తగ్గిపోయింది. ఇక మరోవైపు ఆటోమొబైల్‌ రంగంలో కూడా భారత్‌ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చని ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ చెబుతోంది. ట్రంప్‌ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటంతో భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టుల(spare parts)పై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.

Share post:

లేటెస్ట్