ట్రూడోకు షాక్.. స్వపక్షం నుంచి వ్యతిరేకత.. రాజీనామాకు డిమాండ్!

Mana Enadu: కొంతకాలంగా భారత్​పై అక్కసు వెల్లగక్కుతున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau)కు షాక్ తగిలింది. స్వపక్షంలోనే ఆయనపై అసంతృప్తి భగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తూ డెడ్​లైన్ విధించారు.

అక్టోబర్ 28వరకు డెడ్ లైన్
బుధవారం రోజున క్లోజ్డ్‌డోర్‌ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ.. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడానికి ప్రధాని ట్రూడో వైఖరే కారణమని అభిప్రాయపడింది. అనంతరం ట్రూడో రాజీనామా(Canada PM Justin Trudeau) చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారు. అక్టోబర్‌ 28 వరకు డెడ్‌లైన్‌ విధించినట్లు కెనడా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ తెలిపినట్లు సమాచారం.

జాగ్రత్తపడకపోతే చాలా నష్టం
ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఇది మరింత సవాలుగా మారనుంది. జూన్‌, సెప్టెంబర్‌ ఎన్నికల్లో లిబరల్స్‌ బలమైన రెండు స్థానాలను కోల్పోవడమే గాక.. వచ్చే ఎన్నికల(Canada Elections)కు చేసే సన్నాహాలు కూడా దారుణంగా ఉన్నాయని ఎంపీలు భావిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి ట్రూడోకు ఇంకా సమయం ఉందని.. సహచరులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు దాన్ని వినడం చక్కదిద్దుకోవడం చాలా ముఖ్యమని ఎంపీలు వ్యాఖ్యానించారు.

దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలు
ఇక గత కొంతకాలంగా భారత్​(India)పై అక్కసు వెల్లగక్కుతున్న కెనడా.. ఖలిస్థానీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని భారత ప్రభుత్వ ఏజెంట్లు పనిచేస్తున్నారని, వారికి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగులతో సంబంధాలున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి కేవలం తమవద్ద గతంలో నిఘా సమాచారం మాత్రమే ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల తెలిపారు. అయితే కెనడా(Canada) చేసిన ఆరోపణలతోఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి.

Share post:

లేటెస్ట్