‘ట్రంప్‌’కు మతి తప్పుతోంది : కమలా హారిస్

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికలు(US Presidential Elections 2024) సమీపిస్తున్నాయి. నవంబరు 5వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు ఎక్కుపెడుతూ అగ్రరాజ్యంలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తాజాగా ప్రచారంలో పాల్గొన్న కమలా హారిస్‌ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు క్రమంగా మతి తప్పుతోందని కామెంట్స్ చేశారు.


హిట్లర్ లాంటి వాళ్లు కావాలి

ఇటీవల యూఎస్‌ మెరైన్‌ జనరల్‌ జాన్‌ కెల్లీ మాట్లాడుతూ.. హిట్లర్‌ కొన్ని మంచి పనులు చేశారని ట్రంప్‌ అన్నారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా అమెరికాకు మిలటరీ బదులుగా హిట్లర్‌(Hitler) వంటి జనరల్స్‌ ఉండాలని ఆయన భావిస్తున్నారని పేర్కొన్నారు. కెల్లీ వ్యాఖ్యలపై తాజాగా కమలా హారిస్ స్పందించారు.

ట్రంప్ చాలా ప్రమాదకరం

6 మిలియన్ల మంది యూదులు, వందల వేల మంది అమెరికన్ల మరణాలకు కారణమైన వ్యక్తి హిట్లర్‌ అని కమలా హారిస్(Kamala Harris) గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ప్రశంసించడం ఆందోళన కలిగిస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమైనదని అన్నారు. అమెరికన్‌ ప్రజలకు ట్రంప్‌ ఎలాంటి వారు అనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని హారిస్ పేర్కొన్నారు.

29న హారిస్ చివరి ఎన్నికల సభ

ఇక కమలా హారిస్‌ తన చివరి ఎన్నికల ప్రచార సభ(Harris Election Campaign)ను ఈనెల 29వ తేదీన నిర్వహించనున్నారు. 2021 జనవరి 6న జరిగిన అల్లర్లకు ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీ చేసిన చోటే ఆమె ప్రసంగించనున్నారు. 2020 ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడులు చేయగా.. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. 140 మంది పోలీసులు గాయపడ్డారు.

Share post:

లేటెస్ట్