TS Police | యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్.. మీకు నిజంగా సెల్యూట్ బాస్!

Mana Enadu: అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్​(CPR) చేసి ప్రాణాలను కాపాడుతూ జనాల మన్ననలు పొందుతున్నారు.

ఆత్మహత్య ప్రయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లే సూర్యనారాయణ, నర్శింహాలు. ఖాకీల సమయస్ఫూర్తికి రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి.

హైదరాబాద్​ (Hyderabad) బడంగ్‌పేట్ ప్రాంతంలో నివసిస్తున్న జగన్ అనే వ్యక్తి కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు డయల్ 100కు(DIAL 100) కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించాడు. అదే సమయంలో మీర్​ పేట్(Meerpet Police station)​ పోలీస్​ స్టేషన్​లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ సూర్యనారాయణ నరసింహ వెంటనే స్పందించారు. జగన్ నివాసానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు జగన్. ఫ్యాన్‌కు వేలాడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జగన్‌ను చూసిన కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. అతన్ని కిందకు తీసి వెంటనే సిపిఆర్ చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు జగన్.

జగన్ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సూర్యనారాయణ నరసింహులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. రాచకొండ సీపీ వారిద్దరికి అభినందనలు తెలిపారు.

Share post:

లేటెస్ట్