
మరో దేశాన్ని భూకంపం వణికించింది. భారత కాలమానం శుక్రవారం 8 గంటల సమయంలో రాత్రి అర్జెంటీనా(Earthquake)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేశారు. భూకంపం బలమైన ప్రకంపనలు ప్రజలలో భయాందోళనలను సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. దక్షిణ అర్జెంటీనా (South Argentina)లోని ఉషుయాకు దక్షిణంగా 219KM దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్‌లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(United States Geological Survey) తెలిపింది.
❗️🌊 URGENT: TSUNAMI WARNING IN CHILE & ARGENTINA 🇨🇱🇦🇷
Waves up to 3 meters forecast along Chile’s coast!
Mass evacuations ordered in southern Chile & Argentina, move to higher ground NOW!#Tsunami #Chile #Argentina #BreakingNews #Earthquake #DisasterAlert #ONEMI pic.twitter.com/CgnYQSN70X— X-Trending (@viralposts2323) May 2, 2025
ఆ ప్రాంత వాసులు ఖాళీ చేయాలి సూచన
అర్జెంటీనాలోని ఉషుయా నగర తీరానికి 219 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS తెలిపింది. భూకంపం తర్వాత వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. దీనితో అధికారులు ప్రజలు తీరం నుంచి దూరంగా వెళ్లి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంతాలకు దక్షిణ అర్జెంటీనా, చిలీలోని కొన్ని ప్రాంతాలకు US సునామీ హెచ్చరికలు జారీ చేసింది. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్(Chilean President Gabriel Boric) మాగల్లనెస్ ప్రాంతమంతటా తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని Xలో పోస్ట్ కోరారు. కాగా ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్‌తో పాటు న్యూజిలాండ్‌లోనూ భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే.