
ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మూడు కొత్త సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), జియోహాట్‌స్టార్(JioHotstar), ZEE5లలో సరికొత్త సినిమాలు(Movies), వెబ్ సిరీస్(Web Series)లు విడుదలయ్యాయి. వీటిలో భైరవం(Bhairavam), కుబేర(Kubera), స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(Special OPS-2) మూవీలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు ఇటీవల విడుదల కాగా, యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ శైలులతో వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం..
భైరవం (ZEE5, జులై 18): విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెలుగు యాక్షన్ డ్రామాగా రూపొందిన “భైరవం(Bhairavam)” 2024 తమిళ చిత్రం “గరుడన్(Garudan)” రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్(Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తూర్పు గోదావరిలోని ఆలయ భూమిని లక్ష్యంగా చేసుకున్న రాజకీయ కుట్రల చుట్టూ తిరిగే మిత్రుల స్నేహబంధాన్ని చూపిస్తుంది. రూ.1000 కోట్ల విలువైన భూమి కోసం జరిగే ద్రోహం, విశ్వాసం, రాజకీయ ఆటలు కథను ఉత్కంఠభరితంగా మలిచాయి.
కుబేర (ప్రైమ్ వీడియో, జులై 18): శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన “కుబేర(Kubera)”లో ధనుష్(Dhanush), నాగార్జున(Nagarguna), రష్మిక మందన్న, జిమ్ సర్భ్ నటించారు. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఒక సామాన్యుడైన దేవా (ధనుష్) జీవితం ఊహించని కుట్రలో చిక్కుకుని, రిడెంప్షన్ కోసం పోరాడే కథ ఇది. రాజకీయాలు, అధికారం, నీతి సంఘర్షణలతో నిండిన ఈ చిత్రం ఆలోచనాత్మకంగా, ఉత్తేజకరంగా ఉంటుంది. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన ఆకట్టుకుంటుంది.
స్పెషల్ ఓప్స్ సీజన్ 2 (జియోహాట్‌స్టార్, జులై 18): నీరజ్ పాండే సృష్టించిన ఈ స్పై థ్రిల్లర్‌లో కేకే మేనన్(KK Memon) రా ఆఫీసర్ హిమ్మత్ సింగ్(Himmath Singh)గా తిరిగి వచ్చారు. సైబర్ టెర్రరిజం, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై దాడుల నేపథ్యంలో ఈ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కరణ్ టక్కర్(Karun Takkar), తాహిర్ రాజ్ భాసిన్, ప్రకాష్ రాజ్(Prakash Raj) తదితరులు నటించారు. తొలుత ఈ సిరీస్‌ను జులై 11న రిలీజ్ చేయాలని భావించగా, అనివార్య కారణాల వల్ల జులై 18కి వాయిదా పడింది. ఈ సిరీస్ మేకర్స్ అన్ని ఎపిసోడ్‌లను ఒకేసారి విడుదల చేశారు. సో ఇదండీ స్టోరీ. వీటితోపాటు మరికొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు ఈ వీకెండ్ ఓటీటీలోకి రానున్నాయి.