రైతులకు గుడ్‌న్యూస్‌.. గోధుమ సహా 6 పంటలకు MSP పెంపు

Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కర్షకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌(PM-AASHA)కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం (అక్టోబర్ 16వ తేదీ) సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రైతులకు గుడ్ న్యూస్

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రబీ పంట సీజన్‌(Rabi Season)కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచడమే గాక.. క్వింటాల్‌ గోధుమ(Wheat Crop)పై ఎంఎస్‌పీని తాజాగా రూ.150కు పెంచింది. దీంతో గతంలో రూ.2275గా ఉన్న కనీస మద్దతు ధర ప్రస్తుతం రూ.2425కి పెరిగింది.

సర్కారు ఉద్యోగులకు తీపి కబురు

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ – Dearness Allowance) 3శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. మరోవైపు గోధుమ సహా మరో ఆరు పంటల ఎంఎస్పీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా క్వింటాల్‌కు ఆవాలుకు అత్యధికంగా రూ.300పెంచగింది. క్వింటాల్‌ పెసరకు రూ.275, శెనగలకు రూ.210, ప్రొద్దుతిరుగుడు(Sunflower MSP)కు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచింది. 

Share post:

లేటెస్ట్