Mana Enadu : టాలీవుడ్ నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓవైపు వెండితెరపై తన సత్తా చాటుతూనే.. మరోవైపు ఓటీటీలో హోస్టుగానూ అలరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) నాలుగో సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బాలయ్యతో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి
ఇప్పటికే సీజన్ -4లో ఐదు ఎపిసోడ్లు ఆహా (Aha) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆరో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ లో .. శ్రీలీల (Sreeleela), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సందడి చేశారు. ఈ ప్రోమో చాలా ఫన్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మీరు ఎమ్మెల్యే..నేను ఎమ్మెల్యే
‘మీరు ఎమ్మెల్యే..నేను ఎమ్మెల్యే(MLA).. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్’.. అంటూ నవీన్ పోలిశెట్టి చెప్పే డైలాగ్ తో షురూ అయింది ఈ ప్రోమో. ‘రియల్ లైఫ్‌లో చిట్టీ దొరికిందా..?’ అని నవీన్ పొలిశెట్టిని బాలకృష్ణ అడిగారు. డేట్‌కు వెళ్దామన్నామనుకో ఏ యాక్టర్‌ను తీసుకొని వెళ్తామని అడిగితే.. మనం ఇప్పటికే డేట్‌లో ఉన్నామని బదులిచ్చాడు నవీన్ పొలిశెట్టి.
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 6 ప్రోమో అదుర్స్
ఇక బాలయ్యతో శ్రీలీల, నవీన్ పొలిశెట్టి సరదా చిట్‌చాట్ సాగించినట్లు ఈ ప్రోమో చూస్తే తెలిసిపోతోంది. ఈ ఇద్దరు ఎనర్జిటిక్ నటుల ఆటపాటతో సాగుతున్న సీజన్ 4 ఎపిసోడ్ 6 (Unstoppable Episode 6 Promo) ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షోలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేసిన విషయం తెలిసిందే.






