మార్చి నెల వచ్చేసింది. అప్పుడే ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇక వేసవి అనగానే ఐస్ క్రీమ్ లు, కూలర్లు, ఏసీలతో పాటు వినోదం పంచే సినిమాలు (Summer Special Movies) గుర్తొస్తాయి. అందుకే వేసవి స్పెషల్ గా ప్రేక్షకులకు ఫన్ పంచేందుకు, వారిని నవ్వించి, ఏడిపించి, థ్రిల్ కు గురిచేసి, భయపెట్టేందుకు వివిధ జానర్లలో పలు సినిమాలు రెడీ అయ్యాయి. మార్చి నెలలో స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ థియేటర్లలో విడుదలకు రెడీగా ఉన్నాయి.
పవన్ Vs నితిన్
అయితే ఇప్పటికే ఈ సినిమాల బృందాలు విడుదల తేదీలు ప్రకటించాయి. కానీ పరిస్థితుల వల్ల ఈ చిత్రాల విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), నితిన్ రాబిన్ హుడ్ (Robinhood) ఒకే రోజు (మార్చి 28) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో ఏదో ఒక చిత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈనెలలో రిలీజ్ కానున్న చిత్రాలు ఏంటి..? ఏ రోజుల్లో అవి రిలీజ్ కానున్నాయి..? తెలుసుకుందామా..?
మార్చిలో విడుదలయ్యే చిత్రాలివే
- నారి – మార్చి 7
- జిగేల్ – మార్చి 7
- ఛావా (తెలుగు) – మార్చి 7
- కోర్ట్ – మార్చి 14
- దిల్ రూబా – మార్చి 14
- రాబిన్‌హుడ్ – మార్చి 28
- హరిహర వీరమల్లు – మార్చి 28
- మ్యాడ్ స్క్వేర్ – మార్చి 29
మార్చిలో రిలీజ్ కానున్న డబ్బింగ్ సినిమాలు
- కింగ్‌స్టన్ – మార్చి 7
- ఆఫీసర్ ఆన్ డ్యూటీ – మార్చి 7
- వీర ధీర శూరన్: 2 – మార్చి 27
- ఎల్ 2: ఎంపురాన్ – మార్చి 27
ఈనెలలో విడుదలయ్యే హిందీ సినిమాలు
- ది డిప్లొమాట్ – మార్చి 14
- సికందర్ – ఈద్ స్పెషల్ రిలీజ్






