
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రిమాండ్ ను కోర్టు పొడిగించింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వంశీ పోలీసుల రిమాండులో ఉన్నారు. ఇవాళ్టితో ఆ గడువు ముగియడంతో ఆయణ్ను జైలు అధికారులు వర్చువల్‌గా జడ్డి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.