గ్రాండ్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్..మూడుముళ్ళ బంధంతో… ఒక్కటైన జంట..!!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం చాలా వైభవంగా జరిగింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రాండ్ గా నిర్వహించారు. మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యింది.
5ఏళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. తమ ప్రేమకి శుభం కార్డు వేసుకుంది జంట. ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ముహుర్తం ప్రకారం సాయంత్రం 7గంటల 18 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. లావిష్ మ్యానర్ , గ్రాండియర్ గా వరుణ్ పెళ్లి వేడుక జరిగింది.
లావణ్య త్రిపాఠి మెడలో మూడుముళ్లే వేసి ఓ ఇంటివాడయ్యాడు వరణ్ తేజ్. అధికారికంగా మెగా కోడలు అయ్యింది లావణ్య త్రిపాఠి. ఈ ఇద్దరు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. భారతీయ, తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.