Matka : వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’ రిలీజ్‌ డేట్ ఫిక్స్

Mana Enadu : మెగా ప్రిన్స్, టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మట్కా సినిమా నవంబర్ 14 (Matka Release Date)వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. 

మట్కా రిలీజ్ డేట్

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ (Varun Tej Matka) స్టైలిష్ లుక్ లో కనిపించాడు. వింటేజ్ లుక్ లో బూట్ కాట్ సూటులో సిగరెట్ తాగుతూ స్టైలిష్ గా మెట్లు దిగుతూ వస్తున్న పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడట. 

మట్కాపైనే వరుణ్ ఆశలన్నీ

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న మట్కా మేకర్స్‌ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్‌ వైజాగ్‌ లొకేషన్స్‌ రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గ్లింప్స్ (Matka Glimpse) ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి ఫ్లాపు సినిమాల తర్వాత వస్తున్న మట్కాపై ఇటు ప్రేక్షకులతో పాటు అటు వరుణ్ తేజ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా వరుణ్ కు హిట్ అందిస్తుందో లేదో చూడాలంటే చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

Share post:

లేటెస్ట్