మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన మట్కా (Matka) సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా.. అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చాలా కాలంగా వరుణ్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇక తన నెక్స్ట్ మూవీని అందరికీ ఇష్టమైన హార్రర్ కామెడీ జానర్ లో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.
VT15 ఫస్ట్ లుక్ (VT15 First Look) ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. డ్రాగన్ డిజైన్ ఉన్న జాడీపై కోడ్ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని కనిపించడం ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ పోస్టర్ చూస్తుంటే సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. మరోవైపు ఈ పోస్టర్ కింద వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let’s spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025
ఇండో-చైనీస్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా (Express Raja), ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, షూటింగ్, రిలీజ్ అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.






