Mana Enadu : ‘పుష్ప -2 (Pushpa-2)’ సినిమాతో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టనుంది. ఈ బ్యూటీ తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend). ఆమె లీడ్ రోల్‌లో టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గర్ల్ ఫ్రెండ్ కు బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఓవర్
ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇంతవరకు అప్డేట్ రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ మూవీకి ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఆ హీరో ఎవరో కాదు. చాలా కాలంగా రష్మికతో డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కు విజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రష్మిక కోసం విజయ్
ఇప్పటికే గీత గోవిందం (Geetha Govindam), డియర్ కామ్రేడ్ (Dear Comrade) సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో గర్ల్‌ఫ్రెండ్‌కు సపోర్ట్‌గా బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లు ఇవే
ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సంగతికి వస్తే.. ఈ మూవీలో చికాగో బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) మరో కీలక పాత్రలో కనిపించనుంది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.