బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీలక పాత్రలో అక్షయ్ ఒబెరాయ్ నటించారు. శంభాజీ మహారాజ్ వీరగాథగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. విక్కీ కౌశల్ కెరీర్ లోనే అత్యంత వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం
ఇక ఇందులో విక్కీ కౌశల్, రష్మిక (Rashmika Mandanna) నటనలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఒబెరాయ్ (Akshay Oberoi) ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ చూసి తెలుగులోనూ రిలీజ్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగు వెర్షన్ లో విడుదల చేసింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఛావా తన సత్తా చాటింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. థియేటర్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఛావా ఓటీటీ రిలీజ్ డేట్
త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది ఛావా మూవీ. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు నెటిజన్లు.






