‘విక్రమ్’కు షాక్.. ‘వీర ధీర సూరన్’ మార్నింగ్ షో రద్దు

కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram)కు ఈ మధ్య సినిమాలు అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవల తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఇప్పుడు వీరధీరసూరన్ (veera dheera sooran) అంటూ ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఏ అరుణ కుమార్ తెరకెక్కించిన వీర ధీర సూరన్ – పార్ట్ 2 చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఇవాళ ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. కానీ అనుకోకుండా ఈ చిత్ర మార్నింగ్ షో రద్దయింది.

విక్రమ్ కు షాక్

ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న వీరధీర సూరన్-2 (veera dheera sooran 2) చిత్రం మార్చి 27న (ఇవాళ) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా మార్నింగ్ షోస్ ను రద్దు చేశారు. ఈ చిత్రానకిి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదయింది. ఈ సినిమాకు సంబంధించి అన్ని హక్కులను తామే కలిగి ఉన్నామని,  థియేటర్ రిలీజ్ కు సంబంధించి నిర్మాతలు తమతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని ఈ సినిమాకు ఫైనాన్షియర్ గా ఉన్న ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది.

మార్నింగ్ షో రద్దు

తమకు చెల్లించాల్సిన రూ. 7 కోట్ల బకాయిలు ఇచ్చిన తర్వాతే ఈ  సినిమాను విడుదల చేయాలని కోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విక్రమ్ సినిమా విడుదలకు చిక్కొచ్చి పడింది. ఈ క్రమంలోనే వీరధీర సూరన్-2 సినిమా మార్నింగ్ షోను ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ వ్యవహారం చక్కదిద్దుకోవడానికి నిర్మాతలకు ఢిల్లీ హైకోర్టు 48 గంటల గడువు ఇచ్చింది. మరి ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని ఈ చిత్రం రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *