
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ఫ్రాంఛైజీలో హిట్ సీక్వెన్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన హిట్: ది ఫస్ట్ కేసు (HIT 1 : The First Case), హిట్ 2 : ది సెకండ్ కేసు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాల్లో హిట్-1లో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించగా.. హిట్-2లో అడివి శేష్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ రెండు చిత్రాలకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు.
వేసవిలో హిట్-3 రిలీజ్
ఇక ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈసారి హిట్-3లో తానే హీరోగా వచ్చాడు నాని (Nani). హిట్-2 క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ గా ఎంట్రీ ఇచ్చి పార్ట్-3కి హింట్ ఇచ్చాడు. అలా ‘హిట్ 3 : ది థర్డ్ కేసు (HIT 3 : The Third Case)’ సినిమాలో నాని హీరోగా కన్ఫామ్ అయిపోయాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ వేసవిలో థ్రిల్ పంచేందుకు ఈ చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
హిట్-3లో మాస్ హీరో
ప్రస్తుతం యమా స్పీడులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ మాస్ హీరో ఎంట్రీ ఉంటుందని.. అతడే హిట్-4లో హీరోగా నటిస్తాడనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాలతో ఆ హీరో అయితే బాలకృష్ణ (Balakrishna), లేదా రవితేజ (Ravi Teja) అయి ఉంటారనే టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా మరో వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. హిట్-3లో నానితో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా కనిపిస్తారని సమాచారం.
హిట్-3లో ఆ ముగ్గురు
హిట్-1తో అలరించిన విశ్వక్ సేన్, హిట్-2తో అదరగొట్టిన అడివి శేశ్ (Adivi Sesh) నాని నటిస్తున్న హిట్-3 ది థర్డ్ కేసులో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. వీళ్ల కామియో సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. కథలో భాగంగా అర్జున్ సర్కార్ పాత్రకు సపోర్ట్ చేసేందుకు ఈ ఇద్దరి కామియో ఉండనుందని తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Nani #HIT3 #VishwakSen & #AdiviSesh Joins the Third Case!! pic.twitter.com/CbhIqNwapp
— Cinema Pichii (@CinemaPichii) February 12, 2025