
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న పలు కీలక పాత్రలకు సంబంధించి పోస్టర్లను చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వివిధ సినిమా ఇండస్ట్రీల్లోని అగ్రనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్ప సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మంచు విష్ణు తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ప్రభాస్ పారితోషికం ఎంతంటే?
ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో రుద్ర పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి ఓ విషయాన్ని చెప్పాడు విష్ణు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్ (Mohan Lal) కూడా కీలకపాత్రలు పోషించారని.. వాళ్లకు ఈ కథ చెప్పగానే అంగీకరించారని తెలిపాడు. ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదని వెల్లడించాడు. మోహన్‌బాబు (Mohan Babu) మీద ఉన్న అభిమానంతో ఇందులో నటించారని చెప్పుకొచ్చాడు.
ॐ The Mighty ‘Rudra’ ॐ
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as ‘𝐑𝐮𝐝𝐫𝐚’ 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025
అంత పెద్ద వాడివయ్యావా?
“మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లినప్పుడు పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగాను. ఆయన నవ్వుతూ.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా’ అని అన్నారు. ఇక ప్రభాస్ (Prabhas Kannappa) వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. వాళ్లిద్దరి పాత్రలో సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. ఏడు సంవత్సరాల నుంచి కన్నప్ప కోసం పని చేస్తున్నాం. సుమారు రూ.140 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) నటించారు. ఈ పాత్ర కోసం ఆయన్ని సంప్రదించినప్పుడు రెండుసార్లు నో చెప్పారు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయన్ని ఒప్పించాం.” అని విష్ణు తెలిపాడు.
అవ్రామ్ టాలీవుడ్ ఎంట్రీ
ఇక కన్నప్ప సినిమా సంగతికి వస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తీస్తున్నారు. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ రుద్ర పాత్రలో, కాజల్ (Kajal Agarwal) పార్వతీదేవి పాత్రలో సందడి చేయనున్నారు. మోహన్‌లాల్ (Mohanlal), శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు.