
ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే వరుసగా సెలబ్రిటీల పెళ్లి కబుర్లు వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పార్వతీ నాయర్ (parvati nair) కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ భామ ప్రముఖ వ్యాపారి ఆశ్రిత్ తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది.
View this post on Instagram
పార్వతీ నాయర్ పెళ్లి
ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించి ఫొటోలు షేర్ చేసిన పార్వతీ తన పెళ్లి కబురు వినిపించి తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక తాజాగా పార్వతీ నాయర్, ఆశ్రిత్ పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధం (parvati nair wedding)తో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నానితో పార్వతి సినిమా
పార్వతీ నాయర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామ తన అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని (Nani)తో కలిసి ఈ బ్యూటీ ‘జెండాపై కపిరాజు (janda pai kapiraju)’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళం, మళయాళ భాషల్లో కలిపి మొత్తం 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.