
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (kichcha sudeep) హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో కలిసి ముచ్చట పెడుతూ ఆయన తన జర్నీ సాగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఆయనతో ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో అయ్యుండి ఇలా మెట్రోలో ప్రయాణించడం గ్రేట్ అంటూ నెటిజన్లు సుదీప్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025
కిచ్చా సుదీప్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం (Celebrity Cricket League) హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తన టీమ్ తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన ఉప్పల్ స్టేడియానికి మెట్రో (Hyderabad Metro)లో ప్రయాణించారు. దాదాపు 11 సీజన్లగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కిచ్చా సుదీప్.. కర్ణాటక బుల్డోజర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా కర్ణాటక టీమ్ చెన్నై రైనోస్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Superstar @KicchaSudeep Rides Hyderabad Metro! 🚆✨
The Hyderabad Metro welcomed a special traveler on board – none other than Kiccha Sudeep, who chose the city’s favorite mode of transport while in town for the @ccl (CCL)! 🎬🏏
From blockbuster performances on screen to… pic.twitter.com/eVlM8sqpv9
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) February 12, 2025
తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుదీప్
2012లో విడుదలైన ‘ఈగ (Eega Movie)’తో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆయన ఆకట్టుకున్నారు. 2022లో విడుదలైన ‘విక్రాంత్ రోణ (Vikrant Rona)’ చిత్రంతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మ్యాక్స్’ (Max) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి కన్నడలో అందుబాటులోకి రానుంది.