టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వాలెంటైన్స్ డే (Valentines Day 2025) సందర్భంగా ఇవాళ ‘లైలా (Laila)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సాహు గారపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీతో సినిమా రిలీజ్ చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్ కు ఈసారి కూడా అది తప్పలేదు. బాయ్ కాట్ లైలా ట్రెండ్ నడుస్తున్న వేళ విశ్వక్ సేన్ (Vishwak Sen) లైలా సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. విశ్వక్ ప్రయత్నం ఫలించిందా చూద్దాం.
Pure GUTS! @VishwakSenActor has NAILED the lady getup role, showcasing CLASS ACTING! 🔥🔥🔥🔥🔥 A one-man show, Babu! 👌👌🫡🫡 #Laila #MassKadas pic.twitter.com/eE1hxxuvsV
— kiran (@abburi_k) February 13, 2025
లైలా మెప్పించిందా?
విశ్వక్ సేన్ వెరైటీ చిత్రాలు చేస్తూ కాస్త డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నాడు. కానీ వంటలో ఉప్పు తక్కువైనట్లు ప్రతిసారి తన సినిమాలో ఏదో ఒక ఎమోషన్ మిస్ అవ్వుతుండటంతో ఆశించిన ఫలితం రావడం లేదు. ఇక ఈసారి అందరూ మెచ్చే కామెడీ జానర్ లో లైలా సినిమాతో ముందుకు వచ్చాడు. అందులోనూ లేడీ గెటప్పులో అందరినీ ఆకర్షించాడు. విశ్వక్ ను లేడీ గెటప్పులో చూసేందుకైనా థియేటర్ కు వెళ్లాలి అని ఆడియెన్స్ అనుకునేలా చేశాడు.
#LailaMovie విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు.
మరీ ముఖ్యంగా కథ, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాలం నాటి స్టోరి.. స్ర్కీన్ ప్లే.. మ్యూజిక్ సో.. సో.. డైరక్షన్ 👎👎 @VishwakSenActor కష్టం వృథా అయింది… లేడి గెటప్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు.#Laila – 2/5 pic.twitter.com/q7QK9oqylP
— తార-సితార (@Tsr1257) February 14, 2025
వరుణ్ తేజ్ మట్కా బెటర్
అయితే ఈ సినిమా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Laila Twitter Review) తన వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడని కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తున్నారు. మూవీ పస్ట్ హాఫ్ లో విశ్వక్ కామెడీ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. ప్రతిసీన్ లో హీరో కష్టం కనిపించిందని కొందరు ట్వీట్ చేశారు. మరికొందరేమో.. లైలా ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదని.. సినిమాకు రావడం పెద్ద టైం వేస్ట్ అంటూ కామెంట్ చేశారు. కామెడీ కూడా పెద్దగా ఫన్ పంచేలా లేదని.. దీనికన్నా వరుణ్ తేజ్ ‘మట్కా (Matka)’ బెటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!!
Expecting a huge comedy riot in 2nd Half😂❤️
Pure @VishwakSenActor Domination !!
#Laila pic.twitter.com/zw8EzBxzZv— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025
కథలో పస లేదు..
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న టాక్ చూస్తుంటే లైలా సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ కష్టం చూసేందుకైనా.. ఈ సినిమాకు వెళ్లాలని కొందరు నెటిజన్లు అంటుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇక మరో రెండ్రోజులు చూస్తే కానీ ఈ సినిమా టాక్ లో ఏమైనా మార్పు కనిపించవచ్చని పలువురు అంటున్నారు. స్టోరీలో పస లేకపోయినా లేడీ గెటప్ లో విశ్వక్ పెర్ఫామెన్స్ చూడటానికైనా వెళ్లొచ్చని చెబుతున్నారు.






