Laila : నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘లైలా’

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా విశ్వక్ సేన్ ‘లైలా (Laila)’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటిసారిగా ఈ యంగ్ హీరో లేడీ గెటప్పులో ఈ సినిమాలో సందడి చేశాడు. అయితే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఓటీటీలోకి లైలా

అయితే ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అయిన లైలా (Laila Ott News) సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు కూడా తిరక్కుండానే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ఆహా (Aha) వేదికగా మార్చి 7వ తేదీ నుంచి లైలా సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

లైలాతో లవ్ లో పడండి

‘లైలా’తో ప్రేమలో పడండి అంటూ ఆహా పోస్టర్‌ షేర్‌ చేసింది. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన ‘లైలా’లో విశ్వక్‌ సరసన ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) నటించారు. అభిమ‌న్యు సింగ్‌, పృథ్వీరాజ్‌, మిర్చి కిర‌ణ్‌, పృథ్వీ కీలక పాత్రల్లో సందడి చేశారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను షైన్ స్క్రీ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకుంది. బాయ్ కాట్ లైలా అంటూ నెట్టింట ట్రెండ్ కూడా నడిచింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *