మన ఈనాడు: ఫోన్స్‌లో కెమెరా క్లారిటీకి ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా కంపెనీలు సైతం కెమెరా క్లారిటీకి పెద్ద పీట వేస్తున్నాయి. ఇందులో భాగంగానే అత్యధికంగా నాణ్యతతో కూడిన కెమెరా ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో ఎక్స్ సిరీస్‌ను రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. వివో ఎక్స్ 100, ఎక్స్ 100 ప్రో పేర్లతో ఫోన్‌లను లాచ్ చేయనుంది..
అదిరిపోతున్న వివో స్మార్ట్:
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఎక్స్ సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. వివో ఎక్స్ 100, ఎక్స్ 100 ప్రో స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. వివో ఎక్స్90 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానుంది.
కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రెయిర్ కెమెరా సెటప్‌లో సోనీ ఐమ్యాక్స్920 ప్రైమరీ ఫోన్‌ను అందించనున్నారు. కెమెరా క్లారిటీ ఎంత అన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అల్ట్రా-వైడ్ షాట్‌ల కోసం Samsung JN1 లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన OmniVision OV64B టెలిఫోటో కెమెరా ఇవ్వనున్నారు.
ఇక వివో ఈ ఫోన్‌ను ప్రపంచంలోని మొట్టమొదటి తక్కువ పవర్ డబుల్ డేటా రేట్ 5 టర్బో (LPDDR5T)-శక్తితో కూడిన స్మార్ట్‌ఫోన్‌గా దీనిని లాంచ్ చేయనున్నట్లు చెబుతోంది.
ఇక వివో ఎక్స్100, వివోఎక్స్ 100 ప్రో రెండు ఫోన్‌లలోనూ మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌ఓసీ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజ్‌తో ఈ ఫోన్ తీసుకొచ్చారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే ఇంకా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే గతంలో విడుదల చేసిన వివో ఎక్స్ 90 ప్రో 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 84,999గా ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 59,999కి సొంతం చేసుకోవచ్చు.