
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ(War between India and Pakistan) వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల(All State)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు సంసిద్ధతను అంచనా వేయడానికి బుధవారం(మే 7) అన్ని రాష్ట్రాలు భద్రతా మాక్ డ్రిల్(Safety mock drill) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) ఆదేశించింది. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానికి దాడులు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.
1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
వైమానికి దాడుల(Air strikes) హెచ్చరిక సైరన్ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రతి స్పందించాలో తెలపాలని.. స్వీయ రక్షణపై పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. 1971 పాక్ యుద్ధం(1971 India-Pakistan War) తర్వాత కేంద్రం అన్ని రాష్ట్రాలను భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడం ఇదే ఫస్ట్ టైమ్. మళ్లీ భారత్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టడంతో పాక్‌తో వార్ షురూ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు దాడిలో 26 మంది పర్యాటకులు బలైన విషయం తెలిసిందే.
Indian 🇮🇳Brahmos Supersonic Cruise Missile Is World’s No.1 Missile With Speed Mach 3.0, Range 1500 KM, Can Carry 300Kg Of Nuclear,
2nd Best Is USA Tomahawk & Russian Kalibr Mach 0.8
India Need 72 Seconds To Delete Islamabad From World Map.#IndiaPakistanWar pic.twitter.com/FMNWp6w3KA— Jian Azmir (@JianAzmir) May 5, 2025