Mana Enadu: గుండె(Heart).. ఏ ప్రాణికైనా ఇదే ముఖ్యం. అది ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతోందో ఇక ఈ లోకంతో సంబంధాలు తెగిపోయినట్లే. ప్రస్తుతం మనుషుల్లో గుండె సమస్యలు(Heart problems) సర్వసాధారణం అయ్యాయి. ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన వారిలోనే గుండె సమస్యలు వస్తుండేవి. కానీ ప్రస్తుతం కాలం మారింది. తినే ఫుడ్, లైఫ్ స్టైల్(Food, lifestyle) అన్నీ మారిపోయాయ్. దీంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య సైతం విపరీతంగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలను సరైన టైమ్‌లో గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు(Medical professionals) చెబుతున్నారు.
కొన్ని రకాల ముందస్తు లక్షణాల(Early symptoms) ఆధారంగా గుండె సమస్యలు ఇట్టే కనిపెట్టవచ్చట. గుండ్ బలహీనంగా మారుతున్న సమయంలో శరీరం మనకు కొన్ని ముందస్తు సంకేతాల(Signs)ను అందిస్తుంది. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
☛ గాలి పీల్చుకోవడం(Inhaling air)లో తలెత్తే సమస్యలు గుండె అనారోగ్యానికి ప్రధాన సమస్యగా భావించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
☛ ముఖ్యంగా శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూతలు దీర్ఘకాలంగా వస్తుంటే వైద్యులను సంప్రదించాలి.
☛ తరచూ తల తిరుగుతున్నట్లు(Dizziness) అనిపించడం కూడా గుండె సమస్యలకు ప్రధాన సంకేతం. మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది.
☛ వీక్ హార్ట్‌కు ప్రధాన లక్షణాల్లో కాళ్లలో వాపు(Swelling in the legs) కనిపించడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. కాలిలోని రక్తనాళాల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. ఇది గుండె బలహీనతను తెలియజేస్తుంది.
☛ గుండె బలహీనంగా గుండె వారిలో కాస్త దూరం నడవగానే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా నడుస్తున్న సమయంలో లోతుగా ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది.
☛ చిన్న చిన్న పనులకే అలసిపోతుంటే గుండె ఆరోగ్యం బలహీనపడుతోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
☛ దగ్గు కూడా గుండె బలహీనతను తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి కార్డియాక్ కఫ్(Cardiac cuff)గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. గుండె పనితీరు మందగించి, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల ఇలాంటి దగ్గు వస్తుందని చెబుతున్నారు. ఈ లక్షణాలు గుండెపోటును ముందుగానే తెలియజేస్తాయని, వీటిని గుర్తించి తగిన చికిత్స(treatment) తీసుకోవాలని వైద్యులు(Doctors) సూచిస్తున్నారు.