Rana Naidu S2: రానా నాయుడు సీజన్-2.. టీజర్ చూశారా?

దగ్గుబాటి వెంకటేష్(Victory Venkatesh), రానా(Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు( Rana Naidu). ఇది OTTలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా వెంటకేష్ తన ఇమేజ్‌ను పూర్తిగా దాటేసి చేసిన పాత్ర ఇది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌(Salt and pepper look)తో విపరీతమైన బూతులు, లస్టీ సీన్స్‌తో నింపేసిన ఈ సిరీస్‌ను వెంకీ చేయడంపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ సీజన్ మాత్రం సూపర్ హిట్(Super Hit) అయింది. అందుకే రానా నాయుడు 2(Rana Naidu Season2)కు మేకర్స్ రంగం సిద్ధం చేశారు.

ఈ ఏడాదే విడుదల

కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్‌ను సుందర్ ఆరోన్ ప్రొడ్యూస్ చేశాడు. 2023 మార్చిలో నెట్ ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమ్ అయిన ఈ సీరీస్కు సెకండ్(Season2) సీజన్‌ను రెడీ చేశారు. అది ఈ ఏడాదే విడుదల కాబోతోందంటూ క్రేజీ అప్డేట్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన టీజర్(Teaser) లాంటి వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఈ సారి పర్సనల్స్‌ను దాటుకుని యుద్ధం(War) రాబోతోందంటూ చెబుతున్నారు. కాస్టింగ్‌ను కూడా బెటర్ చేశారు. మరి ఫస్ట్ పార్ట్‌కు వచ్చిన విమర్శల కారణంగానో ఏమో.. ఈ టీజర్‌లో ఎలాంటి అసభ్యతా లేకుండా చూసుకున్నారు. మొత్తంగా త్వరలోనే కొత్త సీజన్ రాబోతోందని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *