సినిమాల స్టోరీ ఎంపిక(Story selection of movies)లో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి హీరోలకు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. అవి ఆ మూవీ బడ్జెట్ రూపంలోనే కాదు. ఫలితాలను ఎదురుకునే విషయంలో కూడా.. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య(Suriya)ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. నిన్న రిలీజైన ‘పరాశక్తి(Parashakti)’ టీజర్ చూశాక తన ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ముందు ప్రకటించింది సూర్యతోనే. ‘ఆకాశం నీ హద్దురా’ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) ఆయన్నే ఒప్పించింది. కానీ కంటెంట్‌లో ఉన్న సున్నితత్వం వివాదాస్పదం అవుతుందేమోనని భావించిన సూర్య మెల్లగా దాన్నుంచి తప్పుకుని శివ కార్తికేయన్(Shiva Karthikeyan)కు దారి ఇచ్చాడు.
సూర్య ఉంటే నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లేది
తీరా చూస్తే ‘పరాశక్తి’ టీజర్(Parashakti Teaser) అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. దశాబ్దాల క్రితం జరిగిన సంచలనాత్మక సంఘటనలు తీసుకుని సుధా కొంగర ఇచ్చిన ట్రీట్ మెంట్ హీరోతో పాటు శ్రీలీల(Srileela), అధర్వ, రవి మోహన్ ఇలా అందరినీ ఎలివేట్ చేసింది. ఒకవేళ శివ కార్తికేయన్ స్థానంలో సూర్య ఉంటే నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయేది. ఇదే కాదు ఇటీవల సూర్య నటించిన ‘కంగువా(Kanguva)’ మూవీ కూడా అంతగా అలరించలేదు. దీంతో అది కూడా సూర్య బ్యాడ్ డెసిషన్‌లలో ఒకటని ఫ్యాన్స్ అంటున్నారు.
వెంకీ అట్లూరితో ప్రాజెక్టు కూడా..
ఇవే కాదు వెంకీ అట్లూరి(Venky Atluri)తో ప్రాజెక్టు కూడా సూర్యకు మిస్ అయ్యిందని చెన్నై టాక్. దీని స్థానంలోనే ధనుష్‌తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న అట్లూరి త్వరలోనే దాన్ని మొదలుపెట్టొచ్చు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య ఆశలన్నీ ప్రస్తుతం రెట్రో మీదే ఉన్నాయి. కాగా త్వరలోనే డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran)తో సూర్య కొత్త మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.








