వదిలింది వైట్ హౌజును.. పోరాటాన్ని కాదు : బైడెన్‌

‘మేం వదిలింది వైట్ హౌజు, కార్యాలయాన్నే కానీ.. పోరాటాన్ని కాదు.’.. అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసే ముందు..  బైడెన్ దంపతులు సంప్రదాయం ప్రకారం ట్రంప్ దంపతులకు తేనీటి విందునిచ్చారు. ఈ సందర్భంగా బైడెన్‌ ‘వెల్‌కమ్ హోం’ అంటూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు.

వదిలింది ఆఫీసు మాత్రమే

ఇక ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం బైడెన్ కాలిఫోర్నియాకు పయనమవుతూ.. ‘మేము వీడింది కార్యాలయాన్నే కాని, పోరాటాన్ని కాదు. ఈరోజు ట్రంప్ స్పీచ్  విన్నాం.. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని బైడెన్ పేర్కొన్నారు. అనంతరం బైడెన్ దంపతులు హెలికాఫ్టర్‌ ఎక్కి వెళ్లిపోయారు. అయితే తాను రాజకీయాల నుంచి వైదొలగనని, ప్రజా జీవితంలో కొనసాగుతానని బైడెన్‌ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చివరి క్షణంలో పవర్ యూజ్

ఇక అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసే చిట్టచివరి క్షణాల్లో జో బైడెన్‌ తన అసాధారణ అధికారాలను వినియోగించారు. తన తోబుట్టువులకు, వారి జీవిత భాగస్వాములకు చట్టపరమైన రక్షణ కల్పించే ఉత్తర్వులు జారీ చేశారు.  ట్రంప్‌ సర్కార్ ఎవరిపై అయితే ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందో వారందరికీ కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *