అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ సీటులో కూర్చోగానే ఆయన వరుసగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకొన్నారు. ఇక ట్రంప్ తీసుకున్న పలు షాకింగ్ నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవేంటంటే..?
ట్రంప్ ర్యాపిడ్ ఆర్డర్స్ ఇవే..
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికాను ఉపసంహరించుకుంటూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
- వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని (Birth Right) అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు.
- చైనా కంపెనీ టిక్‌టాక్ (TikTok) యాప్‌లో అమెరికాకు 50శాతం వాటా ఉండాలని ట్రంప్ పేర్కొన్నారు.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు.
- 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకొన్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. ఈ నిర్ణయం ట్రంప్ సన్నిహితుడు మస్క్ (Elon Musk)కు కాస్త షాకింగ్ అని చెప్పొచ్చు.
- కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటమ్ జారీ చేశారు.








