గే వివాహాలకు అధికారిక గుర్తింపు.. చట్టబద్ధం చేసిన థాయిలాండ్

థాయిలాండ్ దేశం గే వివాహాలను (Gay Marriages) చట్టబద్ధం చేసింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఆగ్నేయాసియాలో గే మ్యారెజెస్ ను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా.. ఆసియాలో మూడో దేశంగా థాయిలాండ్ నిలిచింది. నేపాల్, తైవాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వస్తుందని థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజునే దాదాపు 300 LGBTQ జంటలు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

20 ఏళ్ల నెరవేరిన డిమాండ్

దాదాపు 20 ఏళ్లుగా థాయిలాండ్‌ (Thailand)లో స్వలింగ సంపర్కుల వివాహాలను (Same Sex Marriage) చట్టబద్ధం చేయాలనే డిమాండ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా అక్కడి ప్రభుత్వం దీన్ని చట్టబద్ధం చేస్తూ వారి పెళ్లిళ్లకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకే జెండర్ కు చెందిన వారిని వివాహమాడొచ్చు.

ఈ జంటలకు ఆ హక్కులు

ఇక వివాహ సమానత్వ చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించగా.. పార్లమెంటు పౌర, వాణిజ్య నియమావళిని.. భార్యాభర్తల స్థానంలో వ్యక్తిగత, వివాహ భాగస్వామిని నియమించడానికి థాయిలాండ్ పార్లమెంట్ కోడ్‌ను సవరించింది. ఈ చట్టం LGBTQ+ జంటలకు సాధారణ వివాహంలో అంటే భార్యాభర్తల్లో లభించే అన్ని హక్కులను అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. LGBTQ జంటలకు చట్టపరమైన, ఆర్థిక, వైద్య విషయాలలో సమాన హక్కులు ఉంటాయని తెలిపాయి. ఆస్తులపై ఉమ్మడి ప్రాప్యత కూడా ఉంటుందని వివరించాయి.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *