
అగ్రరాజ్యం అమెరికా(America)ను మళ్లీ కార్చిచ్చు(Can Burn) కమ్మేసింది. గత నెలలో కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్(Los Angeles)లో మంటలు చెలరేగి వేల ఎకరాల్లో అడవులు, వందల కొద్దీ వన్య ప్రాణులు, హాలీవుడ్ సినీ ప్రముఖుల(Hollywood Celebrities) ఇళ్లు తగలబడిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్ కరోలినా(South Carolina)లో 175 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని అక్కడి అధికారులు తెలిపారు. కార్చిచ్చు ప్రభావాన్ని తగ్గిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది(Firefighters) మంటలను ఆర్పుతున్నారు. సౌత్ కరోలినాలో ఇప్పటికే 4.9 చదరపు కి.మీ. మేర అటవీ భూమిలో కార్చిచ్చు వల్ల చెట్లు మసైపోయాయినట్లు అధికారులు తెలిపారు.
175 ప్రాంతాల్లో మంటలు
అయితే ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని అధికారులు తెలిపారు. అయితే సౌత్ కరోలినాలో మాత్రం ఎమర్జెన్సీ(Emergency) విధించారు. ఈ మేరకు గవర్నర్ హెన్రీ మెక్ మాస్టర్(Governor Henry McMaster) ప్రకటన చేశారు. 175 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అన్నారు. నార్త్ కరోలినాలో 4 ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల 400 ఎకరాల అటవీ భూమి కాలిపోయిందని, నార్త్ కరోలినాలోని పోల్క్ కౌంటీలో ప్రజల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
కార్చిచ్చుపై ట్రంప్ సమీక్ష
కాగా దాదాపు 600 ఎకరాలను నాశనం చేసిన కార్చిచ్చును ఆపడానికి దానిచుట్టు కంటైన్‌మెంట్ లైన్లు(Containment lines) ఏర్పాటు చేస్తున్నారు. కాగా కార్చిచ్చుపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సమీక్షించారు. అటు స్థానిక అధికారలతో ఫోన్‌లో సంభాషించారు. వీలైనంత త్వరగా మంటలు ఆర్పే ప్రయత్నాలు చేయాలని సూచించారు.