Mana Enadu : పుష్ప-2 (Pushpa 2) సినిమా బెన్ ఫిట్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బన్నీ అరెస్టయి (Allu Arjun Bail) బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే తాజాగా ఈ బెయిల్ రద్దు కానుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ బెయిల్ రద్దు చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బెయిల్ రద్దుకు పోలీసుల ప్రయత్నం
సంధ్య థియేటర్ కేసులో పోలీసులు అల్లు అర్జున్ (Allu Arjun Arrest) ను ఏ11గా పేర్కొని శుక్రవారం రోజున అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. అయితే హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బెయిల్ రద్దు (Allu Arjun Bail Cancel News) కోసం అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నట్లు సమాచారం.
బెయిల్ రద్దయ్యేనా..?
అయితే అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు సమాచారం అందించామంటూ సంధ్య థియేటర్ (Sandhya Theatre Case Update) యాజమాన్యం అధికారులకు రాసిన లేఖను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేం లేదని.. పోలీసులే తమ విధులు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అసలు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ కానీ పుష్ప టీమ్ మెంబర్స్ కానీ వెళ్లేందుకు తాము అనుమతి ఇవ్వలేదంటూ తాజాగా చిక్కడపల్లి పోలీసులు రాసిన ఓ రాతపూర్వక లేఖ బయటకువచ్చింది. ఈ క్రమంలో ఈ లేఖతోనే పోలీసులు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






