World Cup 2023: గత వరల్డ్ కప్ కెప్టెన్లు అందరికీ ఐసీసీ ఆహ్వానం.. వాళ్ళొస్తారా?

మ‌న ఈనాడుః
వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఒక్కరోజే ఉంది. ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ కోసం గత వరల్డ్ కప్స్ లో విజేతలుగా నిలిచిన కెప్టెన్స్ అందరికీ ఆహ్వానం పంపింది. అయితే ఇమ్రాన్ ఖాన్ వచ్చే అవకాశం లేదు. రణతుంగ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
World Cup 2023: వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ కి వచ్చేసింది. ఒక్క మ్యాచ్.. విజేత ఎవరో తేలిపోతుంది. భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగబోయే పోరు కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఒక పక్క అభిమానులు ఫైనల్ మ్యాచ్ స్వయంగా చూడాలని అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. మరో పక్క ప్రధాని మోడీ మ్యాచ్ వీక్షించడానికి వస్తున్నారని సమాచారం వస్తోంది. ఇక సెలబ్రిటీలు అయితే చెప్పక్కర్లేదు. భారత్-న్యూజీలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనే దేశంలోని టాప్ సెలబ్రిటీలు.. టాలీవుడ్ స్టార్స్ హంగామా చేశారు. ఇక ఫైనల్స్ అంటే చెప్పక్కర్లేదు కదా. స్టేడియం వీక్షకుల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఇలా ఉంటె అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఫైనల్స్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం మునుపటి ప్రపంచ కప్ ఛాంపియన్ కెప్టెన్లందరికీ (1975 నుంచి 2019 వరకు) ఆహ్వానాలు పంపింది.

వెస్టిండీస్ కు చెందిన క్లైవ్ లాయిడ్ (1975, 1979), భారత్ కు చెందిన కపిల్ దేవ్ (1983), ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ (1987), పాకిస్థాన్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ (1992), శ్రీలంకకు చెందిన అర్జున రణతుంగ (1996), ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా (1999), రికీ పాంటింగ్ (2003, 2003, 2007), భారత్ కు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ (2003, 2007).

వీరిలో ఇద్దరు తప్ప మిగిలిన అందరూ అహ్మదాబాద్ మ్యాచ్ లో(World Cup 2023) అభిమానులను అలరించే అవకాశం ఉంది. 1992లో వన్డే ప్రపంచకప్ గెలిచిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఒకవేళ ఆయన జైల్లో లేకపోయినా రావడం అంత సులువు కాదు. ప్రధాని అయ్యాక ఇమ్రాన్ పదేపదే భారత్ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తువచ్చారు. ఇప్పుడు తోషాఖానా కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ను ఆగస్టు 5న అరెస్టు చేశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన బహుమతులను విక్రయించారు.

ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులపై జయ్ షాకు ఆధిపత్యం ఉందని రణతుంగ అన్నారు. వీరి కుమ్మక్కు కారణంగా శ్రీలంక క్రికెట్ అధ్వాన్నంగా తయారైందని రణతుంగ తీవ్ర ఆరోపణ చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు నాశనమవడానికి కారణం భారత్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో రణతుంగ ఐసీసీ ఆహ్వానానికి స్పందించే అవకాశం లేదని చెప్పవచ్చు.
భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో శ్రీలంక జట్టు 9 లీగ్ మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ ల్లో ఓడి 10 జట్లలో 9వ స్థానంలో నిలిచింది. సెమీస్ చేరలేకపోయిన శ్రీలంక 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇంత జరిగిన తర్వాత 1996లో శ్రీలంకను విజేతగా నిలిపిన కెప్టెన్ అర్జున రణతుంగ వస్తాడో లేదో డౌటే.

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య భారత్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరగనుంది. వన్డే ప్రపంచకప్లో మూడు ఆసియా జట్లు మాత్రమే విజయం సాధించాయి. భారత్ రెండుసార్లు, పాకిస్థాన్, శ్రీలంక ఒకసారి గెలిచాయి. ఈ టోర్నీలో ఇది 13వ ఎడిషన్ కావడం విశేషం.

Share post:

లేటెస్ట్