భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్(Yuzvendra Chahal) మాజీ భార్య, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ(Dhanashree Verma) టాలీవుడ్(Tollywood)లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ భామ సిద్ధమైంది. ‘ఆకాశం దాటి వస్తావా(Aakasam Dati Vastavaa)’ అనే తెలుగు చిత్రంతో ఆమె వెండితెర అరంగేట్రం చేస్తోంది. అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో, ధన్‌శ్రీ తన డ్యాన్స్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది. ధనశ్రీ కొన్ని డ్యాన్స్ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్(Yash Master) ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ధనశ్రీతో పాటు మలయాళ నటి కార్తీక మురళీధరన్(Karthika Muralidharan) మరో హీరోయిన్‌గా నటిస్తోంది. శశి కుమార్ ముతులూరి(Sashi Kumar Muthuloori) డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

ఉన్నానో లేనో.. మెలోడీ సాంగ్ విడుదల
తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఉన్నానో లేనో..’ అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్(Melody Song)ను రిలీజ్ చేశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్(Karthik) తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. హీరో హీరోయిన్ల మధ్య కనిపిస్తోన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ.. మ్యాజికల్ సాంగ్‌కి తగినట్లు వారిద్దరూ డాన్స్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






