Mana Enadu : జొమాటో (Zomato) ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ గురించి తెలియని వారుండరు. అదిరిపోయే ఆఫర్లతో.. ఆకట్టుకునే ప్రోమోలు, యాడ్స్, నోటిఫికేషన్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్ లో జొమాటోనే నంబర్ వన్ అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించడంలో ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ కంపెనీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది.
డెలివరీ బాయ్స్ కు అవమానాలు
అయితే జొమాటో డెలివరీ ఏజెంట్లు (Zomato Food Delivery Boys) నిర్ణీత సమయంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు చాలా కష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా వారు క్షణాల్లో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ మన చేతుల్లో పెడుతుంటారు. అయితే ఈ క్రమంలో వాళ్లు ఎన్నో కష్టాలు పడటం కామన్.. కానీ చాలాసార్లు వారు అనేక అవమానాలకు కూడా గురవుతుంటారు.
డెలివరీ బాయ్ అవతారంలో జొమాటో సీఈవో
ఈ విషయం కాస్త జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న పరిస్థితులు తెలుసుకునేందుకు ఆయన ఇటీవల డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఆ సమయంలో ఓ మాల్‌లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. దాని గురించి వివరిస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
జొమాటో సీఈవోకు చేదు అనుభవం
రెండో ఆర్డర్‌ను తీసుకునేందుకు మాల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. నన్ను మెట్ల మార్గంలో వెళ్లమని సూచించారు. డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో కలిసి జొమాటో(Zomato) మరింత దగ్గరగా పని చేయాల్సి ఉందనే విషయం ఈ ఘటన ద్వారా నాకు అర్థమైంది అని దీపిందర్ గోయల్ ఈ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners.
What do you think? pic.twitter.com/vgccgyH8oE
— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024






