జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..?

‘మహేశ్.. వీలైతే రెండు సమోసాలు.. కుదిరితే కప్పు కాఫీ’…. ‘డైటింగ్ ఎవరైనా చేస్తారు.. కానీ బిర్యానీ ఆర్డర్ చేసి తినే వాళ్లకే ఓ రేంజ్ ఉంటది’…. ఈ డైలాగులు చూస్తుంటే దేని గురించి మాట్లాడుతున్నామో అర్థమవుతోంది కదా. ఆన్‌లైన్ ఫుడ్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తన కస్టమర్లను ఆకర్షించేందుకు పంపే నోటిఫికేషన్లే ఇవి. కస్టమర్లను ఆకర్షించేందుకు వరుస ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తున్న జొమాటో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..?

జొమాటో కొత్త పేరు ఇదే

జొమాటో పేరు మారుతోంది. పేరు మార్పును కంపెనీ బోర్డు ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ (deepinder goyal) వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయం తెలిపారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదని వెల్లడించారు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుందని.. కేవలం కంపెనీ పేరు మాత్రమే మారినట్లు తెలిపారు. ఇంతకీ జొమాటో లిమిటెడ్ కంపెనీ కొత్త పేరు ఏంటంటే..  ‘ఎటర్నల్ (Eternal)’ లిమిటెడ్ గా కొత్త పేరు పెడుతున్నట్లు దీపిందర్ గోయల్ ప్రకటించారు.

Aa1ywbpq

అందుకే పేరు మార్పు

కంపెనీ ఫుడ్ డెలివరీతో పాటు ఇతర రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నందున పేరు మార్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ పేరు తెలిపారు. బ్లింకిట్‌(Blink It)ను సొంతం చేసుకున్నప్పటి నుంచి జొమాటోను ఎటర్నల్‌గా వ్యవహరిస్తూ వచ్చామని.. కానీ దాన్ని బహిరంగంగా ప్రకటించలేదని వెల్లడించారు. ప్రస్తుతం జొమాటో కిరాణా, టిక్కెట్ల అమ్మకం, తదితర వ్యాపారాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *