టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులు, మయోసైటిస్, సినిమాలకు ఏడాది గ్యాప్ తర్వాత సామ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేస్తోంది. ముఖ్యంగా హెల్త్, కాన్ఫిడెన్స్, మహిళల సంరక్షణ వంటి అంశాలపై ఎక్కువగా పోస్టులు పెడుతోంది. ఈ అంశాలకు సంబంధించి నిపుణులు చెప్పిన, తనకు తెలిసిన విషయాలను నెటిజన్లతో పంచుకుంటోంది.
View this post on Instagram
ఒక్క లైకుతో చర్చ షురూ
ఈ క్రమంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు (Samantha Post Like) లైక్ చేసింది. అయితే అది వైవాహిక బంధానికి సంబంధించిన పోస్టు కావడంతో ఇప్పుడు నెటిజన్లు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వైవాహిక బంధాలు విచ్చిన్నం కావడంపై వచ్చిన పోస్టును లైక్ చేయడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యం పాలైన భర్తను వదిలించుకునేందుకే భర్తలు మొగ్గు చూపిస్తున్నారంటూ ఓ సర్వే గురించి ఉన్న పోస్టును సమంత లైక్ చేశారు. ఇప్పుడు ఇది సమంత-నాగచైతన్య విడాకుల (Samantha Naga Chaitanya Divorce) కారణంపై చర్చకు దారి తీసింది.
View this post on Instagram
విడాకులకు అదే కారణమా?
సక్సెస్ వెర్స్ (Success Verse) అనే ఇన్‌స్టా ఖాతాలో తాజాగా వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల జరిగిన ఓ సర్వేకు సంబంధించిన పోస్టు షేర్ చేశారు. ‘‘లైఫ్ పార్టనర్ అనారోగ్యానికి గురైతే మగవాళ్లు ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నారు. కానీ భర్త హెల్త్ పాడైతే భార్యలు మాత్రం అతడిని విడిచిపెట్టాలనుకోక పోగా.. దగ్గరుండి మరి సేవలు చేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం ఇది నిరూపితమైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే కష్టకాలంలో భర్త వారి వెంట నిలవకుండా విడిపోవడానికే నిర్ణయించుకుంటున్నాడని సర్వేలో తేలింది.’’ అనేది ఆ పోస్టులో ఉంది. దీన్ని నటి సమంత లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే నాగచైతన్య సామ్ కు విడాకులు ఇచ్చేందుకు ఇదే కారణమా అని ఇప్పుడు నెటిజన్లు నెట్టింట డిబేట్ షురూ చేశారు.






