Qantas Airlines: విమానంలో అడల్డ్ మూవీ.. షాక్ అయిన ప్రయాణికులు

Mana Enadu: సాధారంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రెండు, మూడు రోజులు ఉంటాయి. ఎంత పొరుగున ఉన్న కంట్రీ అయినా సరే.. ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్లాలంటే కచ్చితంగా సగంరోజు అయినా పడుతుంది. అందుకే ఈ ఫ్లైట్లలో ప్రయాణికుల(Passengers )కు బోర్ కొట్టకుండా ఉండేందుకు టీవీ స్క్రీన్లు(TV screens) ఉంటాయి. వీటిల్లో వారికి నచ్చిన సినిమాలు, వీడియోలు(Movies and videos) పెట్టుకుని చూసుకునే వీలుంటుంది. అందుకు తగ్గట్లుగానే విమానయాన సంస్థలు(Airlines) అన్ని భాషలకు సంబంధించి కంటెంట్‌ను ముందే సెలక్ట్ చేసి పెడితుంది కూడా. దీంతో మనకు కావాల్సిన వీడియోలు, సినిమాలు ఫ్లైట్ జర్నీ(Flight Journey)లో చూడొచ్చు. ఇయితే ఇదంతా ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

 బెడిసి కొట్టిన ప్లాన్

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడా(Sydney to Haneda)కు వెళుతున్న క్వాంటస్ విమానం(Qantas aircraft)లోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా “డాడియో(Daddio), 2023’’ అనే అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. మూవీ తమ స్క్రీన్లపై ప్రసారం కాగా దాన్ని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇది అచ్చంగా పెద్దలు మాత్రమే చూసే సినిమా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పాపం వాళ్ల ఐడియా మొత్తానికే బెడిసి కొట్టింది. ఫ్లైట్‌లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సినిమా వల్ల వారు చాలా అసౌకర్యం(Inconvenient)గా ఫీలయ్యారు. ఎంత ప్రయత్నించినా టీవీలు ఆగలేదు. అయితే సాంకేతిక సమస్య(Technical Issue) వల్ల ఇలా జరిగినట్లు ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

 సాంకేతిక సమస్య వల్లే: క్వాంటాస్ ఏర్వేస్

అయితే దీనిపై క్వాంటాస్ ఏర్‌లైన్స్(Qantas Airlines) స్పందించింది. ఎవరైతే వద్దని కోరారో అక్కడి స్క్రీన్లలో చిత్రం రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు ఎలాగోలా ఆ చిత్రాన్ని నిలిపివేసి దానికి బదులు పిల్లలకు ఇష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్‌లైన్స్‌ చెప్పింది. ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ(Sorry) క్వాంటాస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతి ప్రయాణికుడికి మేం క్షమాపణలు చెబుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఇదంతా సాంకేతిక సమస్య(technical glitch) వల్లే ఎదురైందని ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదండీ ఫ్లైట్‌(Flight)లో అడల్డ్ మూవీ జర్నీ. మీకూ ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా?

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *