New Liquor Policy: మందుబాబులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు

Mana Enadu: ఏపీ(Andhra Pradesh)లోని మందుబాబులకు శుభవార్త. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy) అమలులోకి రానుంది. మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు(Allotment of liquor shops) ప్రక్రియ జరుగుతోంది. దీంతో నేటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ప్రముఖ బ్రాండ్లన్నీ(All Brands) తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే మందుబాబులకు 99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసర్తుల చేస్తోంది.

 ఆరంభంలో దాదాపు 2లక్షల కేసుల స్టాకు

గతంలో YCP ప్రభుత్వ హయాంలో మద్యం భారీ ధరలతో మందుబాబులు అల్లాడిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం క్వార్టర్ బాటిల్(quarter bottle) మద్యాన్ని రూ.99కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాలుగు జాతీయ కంపెనీల(National Companies)తో వీటి సరఫరా కోసం చర్చలు జరుపుతోంది. అయితే ఎంత స్టాక్(Stock) తీసుకోవాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆరంభంలో సుమారు 2 లక్షల కేసులు తీసుకుని ఆ తర్వాత మిగిలిన స్టాక్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ(New Excise Policy)లో భాగంగా క్వార్టర్‌ రూ.99 ధరతో మద్యం అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా వారంలోపు దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 ధరల కోసం ప్రత్యేక కమిటీ

మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీ(Committee)ని నియమించబోతోంది. ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్(Final Price Fix)) చేస్తుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరగబోతున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు(Liquor sales) జరుగుతాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *