కొడుకే వారసుడా? కూతురు కాదా?.. చిరుపై శ్యామ‌ల కౌంట‌ర్

‘మా ఇంట్లో అందరూ అమ్మాయిలే. చరణ్ ను కొడుకుని కనమని చెబుతున్నాను. మెగా ఫ్యామిలీకి ఓ వారసుడు కావాలి’ అంటూ బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇప్పటికే చిరు కామెంట్స్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 2025 కాలంలో కూడా ఇంకా వారసుడిగా అబ్బాయే కావాలని అనడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా దీనిపై యాంకర్, నటి శ్యామల (Shyamala) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవి కామెంట్స్ పై తీవ్రంగా విమర్శలు కురిపించారు.

వారసుడు కొడుకేనా.. కూతురు కాదా?

“కొడుకే వారసుడు అవుతాడా.? కూతుళ్లు అవ్వ‌లేరా.. నాకు ఈ కామెంట్స్ అర్థం కాలేదు. చిరంజీ గారు ఏం ఉద్దేశంతో అలా మాట్లాడి ఉంటారో ఆయనకే తెలియాలి. వార‌సుడు కొడుకు మాత్ర‌మే అవ్వాలి అనే ఆలోచ‌న నుంచి చిరంజీవితో పాటు చాలామంది బ‌య‌ట‌కు వ‌స్తే బాగుంటుంది. ఈ జ‌న‌రేష‌న్‌లో ఇలాంటి వ్యాఖ్య‌లు సరికావు. చిరంజీవి ఇంట్లోనే వ్యాపారంలో చక్కగా రాణిస్తున్న ఆయన కోడలు ఉపాసన ఉన్నారు. వార‌సుడు కొడుకు మాత్ర‌మే కాదు కూతురు కూడా అవ్వ‌ొచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ఈ విష‌యంలో ఇంత‌కంటే ఎక్కువ‌గా మాట్లాడ‌లేను.” అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం (Brahma Anandam)’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఓ మనవడు కావాలని చిరంజీవి అన్నారు. కానీ చ‌ర‌ణ్‌కి మ‌ళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని తనకు భయంగా ఉందంటూ చిరంజీవి (Chiranjeevi Sexist Comments) చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2025లో కూడా వారసుడు కావాల‌ని కోరుకుంటున్న మ‌నుషులు ఉన్న స‌మాజంలో మ‌నం బతుకుతున్నాం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *