నందమూరి బాలకృష్ణ (Balakrishna) వారసుడిగా మోక్షజ్ఞ తేజ త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తన ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని వ్యాపార రంగంలో తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె అచ్చం హీరోయిన్ లా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే గతంలో బ్రాహ్మణి(nara brahmani)కి తన సినిమాలో హీరోయిన్ గా నటించే బంపర్ ఆఫర్ ఇచ్చారట డైరెక్టర్ మణిరత్నం. కానీ అందుకు ఆమె నో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి బాలయ్య బాబు చెప్పారు.
బాలయ్య ఏం చెప్పారంటే..
బాలకృష్ణ తాను హోస్టుగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable with NBK) సీజన్ 4.. ఎపిసోడ్ 8లో దర్శకుడు బాబీ (KS Ravindra), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman), నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) సందడి చేశారు. ఈ సందర్భంగా ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?’ అని తమన్ అడగ్గా .. ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెప్పారు బాలయ్య. అలాగే.. తన కుమార్తెకు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
నేను భయపడేది బ్రాహ్మణికే
‘‘డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్‌గా బ్రాహ్మణిని నటిస్తావా అడిగారు. ఆ విషయాన్ని నేను మా అమ్మాయికి చెబితే.. నా ముఖం అని సమాధానమిచ్చింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని అంటే.. తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కానీ మా చిన్నమ్మాయి తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది. తనైనా నటి అవుతుందనుకున్నా. కానీ తాను వేరే మార్గం ఎంచుకుంది. ఈ షోకు ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్. నేను భయపడేది బ్రాహ్మణికే’’ అని బాలయ్య అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ మరెన్నో సంగతులు పంచుకున్నారు. అది చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. చూసేయండి.
To all the Lion fans 🦁! Experience Mass vibes 🤩, mass punches , and unstoppable entertainment 🎥 now on #Aha 👉
Watch #UnstoppableS4 episode 8 now on #aha▶️ https://t.co/cMkbbCJ60O #UnstoppableWithNBKS4 #Unstoppable #UnstoppableS4 #Aha #NandamuriBalakrishna @MusicThaman… pic.twitter.com/vp7bcaDILM
— ahavideoin (@ahavideoIN) January 3, 2025







