Mana Enadu: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిర వరుణుడు తాజాగా బెంగళూరు(Bengaluru)పై తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)కు దేశ టెక్ నగరం(Tech City) చిగురుటాకులా వణుకుతోంది. జనం ఇళ్లలో నుంచి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లపై వరద నీరు ఏరులై పారుతోంది. నిన్న బెంగళూరులో కురిసిన భారీ వర్షంతో రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయ్యాయి. దీంతో పాటూ టెక్ పార్క్(Tech Park) సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా వర్షం కారణంగా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్‌లోని చాలా కంపెనీలు నీటితో నిండి ఉన్నాయి. దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని కంపెనీలు కూడా ఉద్యోగులకు సూచించాయి.
వర్క్ ఫ్రం హోమ్, స్కూళ్లకు సెలవు
బెంగళూరులోని RGA టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్‌లోని విప్రో గేట్, అలాగే ITPLలోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులోనే ఉన్నాయి. బుధవారం కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ(Department of Meteorology) హెచ్చరించడంతో కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. అటు స్కూళ్లకూ ఈరోజు హాలిడే ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరులో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్(IND VS NZ) తొలి టెస్ట్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉంటుందని IMD అధికారులు భావిస్తున్నారు. వర్షం కారణంగా నిన్న ఇరు జట్లు ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి.
ఏపీ, తెలంగాణలోనూ విస్తారంగా వానలు
ఇదిలా ఉండగా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని IMD అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- దక్షిణ కోస్తా తీర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీ(Andhrapradesh)లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ(Telangana) జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమవుతోందని వాతావరణశాఖ పేర్కొంది.
Heavy rains and floods again in #ChennaiRains2024, hope the situation will improve soon. Everyone is requested to be alert and stay safe.#ChennaiRains #ChennaiFloods #ChennaiRainsUpdate #RainAlert #BengaluruRains #Rains
#LawrenceBishnoi pic.twitter.com/PytlsTaMmT— Akki Sehra (@Akkisehra) October 15, 2024